పారా కోర్సులతో మెండైన ఉపాధి
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:20 AM
వైద్యశాఖ అనుబంధంగా ఆరోగ్య సంరక్షణకు వివిధ రూపాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. వాటిని సొంతం చేసుకోవాలంటే పారా మెడికల్ సైన్స కోర్సులను అభ్యసించాలి. వాటిని ఆంధ్రప్రదేశ రాష్ట్ర అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తుల మండలి(ఏపీఎ్‌సఏహెచపీసీ) డిప్లొమా కోర్సుల రూపంలో అందిస్తోంది.
ఫ రెండేళ్ల డిప్లొమాతో అవకాశం
ఫ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషనఅనంతపురం వైద్యం, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): వైద్యశాఖ అనుబంధంగా ఆరోగ్య సంరక్షణకు వివిధ రూపాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. వాటిని సొంతం చేసుకోవాలంటే పారా మెడికల్ సైన్స కోర్సులను అభ్యసించాలి. వాటిని ఆంధ్రప్రదేశ రాష్ట్ర అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తుల మండలి(ఏపీఎ్‌సఏహెచపీసీ) డిప్లొమా కోర్సుల రూపంలో అందిస్తోంది. రెండేళ్ల వ్యవధిగల కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన జారీ చేశారు. ఏపీఎ్‌సఏహెచపీసీ అనుబంధంగా ప్రభుత్వ వైద్య కళాశాల డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ఇంటర్మీడియట్ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిచేందుకు నోటిఫికేషన జారీచేశారు.
రెండేళ్ల కోర్సులు
ఏపీఎ్‌సఏహెచపీసీ ఆధ్వర్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన (ఎంఎల్‌టీ), ఆప్తాల్మిక్ అసిస్టెంట్(ఓఏ), అనస్తిషియా టెక్నీషియన(ఏఎనఎ్‌స), మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన(ఎంఐటీ), ఈసీజీ టెక్నీషియన(ఈసీజీ), రేడియో గ్రాఫిక్ అసిస్టెంట్(ఆర్జీఏ), డార్క్‌రూమ్ అసిస్టెంట్(డీఆర్‌ఏ), మెడికల్ స్టెరిలేజేషన మేనేజ్‌మెంట్ స్టాఫ్(ఎంఎ్‌సటీ) తదితర కోర్సులను అందిస్తోంది. రెండేళ్ల డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వైద్యశాఖలో ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ఆపరేషన థియేటర్లు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు, నేత్ర పరీక్షల విభాగం తదితర విభాగాల్లో ఉపాధి లభిస్తుందని వివరిస్తున్నాయి.