20 ఏళ్లుగా భిక్ష
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:04 AM
స్థానిక అయప్పస్వామి ఆలయంలో భిక్ష (అన్నసంతర్పణం) కార్యక్రమం 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.
ఉరవకొండ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక అయప్పస్వామి ఆలయంలో భిక్ష (అన్నసంతర్పణం) కార్యక్రమం 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. 1996లో ఈ ఆలయాన్ని నిర్మించారు. 2006 నుంచి దాతలు, బ్యాంకులో ఉన్న డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీలతో ఈ భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా నవంబరు 16 నుంచి మకరజ్యోతి వరకూ స్వాములకు ఈ భిక్షను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో రోజుకు మధ్యాహ్నం, రాత్రి కలిపి సుమారుగా 500 మంది అయ్యప్ప, ఇతర మాలాధారులకు భిక్షను ఏర్పాటు చేస్తున్నారు.