BANK : బ్యాంకు ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:58 PM
బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న యూనియన బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు.
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల జిల్లా సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న యూనియన బ్యాంకు ఎదుట ఉద్యోగులు నిరసన చేపట్టారు. యూఎ్‌ఫబీయూ నా యకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని 10 లక్షల మంది ఉద్యోగులు నిరసన చేపట్టారన్నారు. ఆరు రోజులపాటు పనిచేయడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. సమస్య పరిష్కరించని ప క్షంలో ఆందోళన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ శంకర్, చంద్రమౌళి, సునీత, లోహిత, రవీంద్రనాయక్, కిరణ్, పావని, సతీష్‌పాల్గొన్నారు.