మార్కెట్ యార్డుకు మొండి బకాయిలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:57 PM
స్థానిక మార్కెట్ యార్డుకు ప్రభుత్వ సంస్థల నుంచి రా వాల్సిన అద్దెలు మొండి బకాయిలుగా మారా యి.
గుంతకల్లు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్ యార్డుకు ప్రభుత్వ సంస్థల నుంచి రా వాల్సిన అద్దెలు మొండి బకాయిలుగా మారా యి. గుంతకల్లు మార్కెట్ యార్డుకు చెందిన గోడౌన్లు, ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ శాఖలకు అద్దె కు ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కేటాయించిన షాపులు, గోడౌన్లకు అద్దెలు సక్రమంగా వసూలవుతుండగా, ప్రభుత్వ సంస్థలు ట్రాన్సకో, సివిల్ సప్లయ్, ఏపీ హౌసింగ్ శాఖల నుంచి దా దాపు రూ. 50 లక్షలు బకాయిలు ఏర్పడ్డాయి.
ట్రాన్సకో: మార్కెట్ యార్డులో ఖాళీ స్థలం ఉండటంతో విద్యుత శాఖ సబ్ స్టేషనను ఏర్పాటుచేయడం కోసం 2007లో లీజుకు స్థలాన్ని తీసుకుంది. స్థలానికి రూ. 12 వేల అద్దె చెల్లించేలా అగ్రిమెంటు చేసుకున్నారు. కానీ 2022లో ఖాళీ స్థల విస్తీర్ణాన్ని అనుసరించి నిబంధనలను అనుసరించి రూ. 1.05 లక్షలుగా అద్దెను మార్కెట్ కమిటీ సవరించింది. అంత మొత్తం ఇవ్వలేమని చెప్పిన విద్యుత శాఖ డబ్బు చెల్లించడం నిలిపివేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రూ. 43.92 లక్షల అద్దె బకాయి ఏర్పడింది.
సివిల్ సప్లయ్ : మార్కెట్ యార్డులో సివిల్ సప్లయ్ రేషన నిల్వ చేయడం కోసం ఆ శాఖ మార్కెట్ యార్డులో గోడౌన్లను అద్దెకు తీసుకుం ది. కాగా అగ్రిమెంటు పూర్తయిందని పేర్కొంటూ మార్కెట్ కమిటీ అధికారులు అద్దెను పెంచగా, తమ నిబంధనల ప్రకారం అంత చెల్లించలేమని, పాత అద్దెనే చెల్లిస్తూ వస్తున్నారు. కొత్త అగ్రిమెంటు చేసుకోలేదు. దీంతో మార్కెట్ కమిటీ లెక్కల ప్రకారం సివిల్ సప్లయ్ శాఖ నుంచి రూ. 2.42 లక్షల అద్దె బకాయి ఏర్పడింది.
ఏపీ హౌసింగ్ : హౌసింగ్ శాఖ మార్కెట్ యార్డులో సిమెంటు నిల్వ ఉంచడానికి ఓ గోడౌనును అద్దెకు తీసుకుంది. దానికి సంబంధించి రూ. 3.81 లక్షల అద్దె బకాయి ఉంది.