వైభవంగా అయ్యప్పస్వామి గ్రామోత్సవం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:58 PM
యాడికిలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని సోమవారం రాత్రి అంగరంగవైభవంగా నిర్వహించారు.
యాడికి, డిసెంబరు8(ఆంధ్రజ్యోతి): యాడికిలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని సోమవారం రాత్రి అంగరంగవైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో కన్నెస్వామిపూజ, లక్షార్చన నిర్వహించారు. సాయంత్రం అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని పేటతుళ్లి నాట్యాలు, వివిధ వేషధారణలతో నృత్యాలు, భజన బృందాలు, 108దీప జ్యోతులతో అంగరంగవైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో ఆలయ అర్చకుడు నాగరాజుశర్మ, గురుస్వామి హరినాథ్, అయ్యప్ప మాలాధారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.