Ayyappa స్వామియే శరణం అయ్యప్పా..!
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:54 AM
అయ్యప్ప నామస్మరణతో మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం మార్మోగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల.. అయ్యప్ప నామస్మరణ నడుమ దీక్షధారులు అగ్నిగుండ ప్రవేశం చేశారు.
భక్తిశ్రద్ధలతో అయ్యప్పల అగ్నిగుండ ప్రవేశం
అనంతపురం టౌన, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): అయ్యప్ప నామస్మరణతో మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం మార్మోగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల.. అయ్యప్ప నామస్మరణ నడుమ దీక్షధారులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఆలయంలో అయ్యప్పస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం దీక్షధారుల అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గర్భగుడిలో స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో అయ్యప్ప దీక్షధారులు ప్రవేశం చేశారు. ఆలయ ఆవరణలో దీక్షధారులకు అల్పాహారం అందజేశారు.