సిరిధాన్యాలపై అవగాహన సదస్సు
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:26 AM
సమాజ క్రాంతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనుములదొడ్డిలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరో గ్యం అనే అంశంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
కుందుర్పి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సమాజ క్రాంతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనుములదొడ్డిలో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరో గ్యం అనే అంశంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి పోషకాహార నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఖాదర్‌వలీ సిరిధాన్యాల ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో సమాజ క్రాంతి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు లెనినబాబు, ట్రస్ట్ సభ్యులు, కోఆర్డినేటర్లు, రచయిత్రి శశికళ పాల్గొన్నారు.