Share News

child marriage బాల్యవివాహాలతో అనర్థాలపై అవగాహన

ABN , Publish Date - May 05 , 2025 | 11:49 PM

స్థానిక నిజాంవలి కాలనీలో మహి ళా బీడీ కార్మికులకు బాల్యవివాహాలతో కలిగే అనర్థాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

child marriage బాల్యవివాహాలతో అనర్థాలపై అవగాహన
ప్రతిజ్ఞ చేస్తున్న కార్మికులు

కదిరిలీగల్‌, మే 5(ఆంధ్రజ్యోతి): స్థానిక నిజాంవలి కాలనీలో మహి ళా బీడీ కార్మికులకు బాల్యవివాహాలతో కలిగే అనర్థాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అనుసంధాన కర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బాల్య వివాహం చట్టరీత్యానేరమని, దాన్ని అడ్డుకోవడానికి సహకరించాలని కోరారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో న్యాయ అను సంధాన కర్త లింగాల లోకేశ్వరరెడ్డి, కార్మికశాఖ ప్రతినిధి సరస్వతి, రైడ్స్‌ సంస్థ ప్రతినిధులు మెహతాజ్‌, అమ్మజాన, ఎలకి్ట్రకల్‌ వైర్‌మన జాఫర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:49 PM