నలుగురు రైల్వే ఉద్యోగులకు అవార్డులు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:25 AM
గుంతకల్లు రైల్వే డివిజనలో పనిచేస్తున్న నలుగురు రైల్వే ఉద్యోగులకు ఎంప్లాయీ ఆఫ్ ద మంత అవార్డులు లభించాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ సోమవారం జోన పరిధిలోని రైల్వే డివిజన్ల డీఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్సను నిర్వహించారు
గుంతకల్లు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గుంతకల్లు రైల్వే డివిజనలో పనిచేస్తున్న నలుగురు రైల్వే ఉద్యోగులకు ఎంప్లాయీ ఆఫ్ ద మంత అవార్డులు లభించాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ సోమవారం జోన పరిధిలోని రైల్వే డివిజన్ల డీఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్సను నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో శ్రద్ధను, ప్రత్యేక నైపుణ్యాన్ని, భద్రతా ప్రమాణాలను, అప్రమత్తతను ప్రదర్శించిన లోకోపైలెట్లు, సహాయ లోకో పైలెట్లు, స్టేషన మాస్టర్లు, పాయింట్స్‌మెన, కీమెనలకు ఎంప్లాయీ ఆఫ్ ద మంత అవార్డులను ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజనలో ముగ్గురికి, హైదరాబాద్ డివిజనలో ఇద్దరికి, గుంతకల్లు రైల్వే డివిజనల నలుగురికి, విజయవాడ రైల్వే డివిజనలో ఇద్దరికి, నాందేడ్, గుంటూరు రైల్వే డివిజన్లలో ఒక్కొక్కరికి ఎంప్లాయీ ఆఫ్ ద మంత అవార్డులు దక్కాయి. గుంతకల్లు రైల్వే డివిజనలో అవార్డులను పొందిన నలుగురు ఉద్యోగులను పిలిపించి అవార్డులను పంపిణీ చేయనున్నారు.