Share News

క్రీడాకారులు రైల్వే సౌకర్యాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:25 AM

రైల్వే అందజేస్తున్న క్రీడా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఆటగాళ్లు తమ ప్రతిభా పాటవాలను మెరుగుపరచుకోవాలని డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా పేర్కొన్నారు. హాకీ లెజెండ్‌ మేజర్‌ ధ్యానచంద్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించా రు.

క్రీడాకారులు రైల్వే సౌకర్యాలను వినియోగించుకోవాలి

డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా

గుంతకల్లు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రైల్వే అందజేస్తున్న క్రీడా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఆటగాళ్లు తమ ప్రతిభా పాటవాలను మెరుగుపరచుకోవాలని డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా పేర్కొన్నారు. హాకీ లెజెండ్‌ మేజర్‌ ధ్యానచంద్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించా రు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఆర్‌ఎం మాట్లాడుతూ రైల్వే శాఖ ప్రజా సేవతోపాటు, క్రీడాభివృద్ధికి ఎంతో తోడ్పడుతోందన్నారు. అధునాతనమైన రైల్వే గ్రౌండు, ప్రాక్టీస్‌ పిచలు, జిమ్‌ తదితర సదుపాయాలను వినియోగించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే గ్రౌండులో రైల్వేలోని వివిధ శాఖల ఉద్యోగులు క్రికెట్‌ను ఆడారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కాచిగూడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

గుంతకల్లు(ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ-తిరుపతి మధ్య (వయా గుంతకల్లు) ఈ నెల 29, 30 తేదీల్లో ఓ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-తిరుపతి (02794) ప్రత్యేక రైలు ఈ నెల 29న రాత్రి 11 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1 గంటకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (02793) 30న రాత్రి 9-10 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు సికకింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, సేడం, యాద్గిర్‌, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.

బిలా్‌సపూర్‌-యల్హంక మధ్య..

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలా్‌సపూర్‌-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బిలా్‌సపూర్‌-యల్హంక ప్రత్యేక రైలు (08261) సెప్టెంబరు 9 నుంచి నవంబరు 18 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 11 గంటలకు బిలా్‌సపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు యల్హంకకు చేరుతుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (08262) సెప్టెంబరు 10 నుంచి నవంబరు 19 వరకూ ప్రతి బుధవారం ఉదయం రాత్రి 9 గంటలకు యల్హంకలో బయలుదేరి శుక్రవారం ఉదయం ఐదున్నరకు బిలా్‌సపూర్‌కు చేరుకుంటుందన్నారు. ఈ రైలు భటపర, రాయపూర్‌, దుర్గ్‌, రాజనంద్‌గావ్‌, డోంగర్‌ఘర్‌, గోండియా, వాడ్సా, చంద ఫోర్ట్‌, బాలార్షా, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌, మంచిర్యాల, ఖాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, యాద్గిర్‌, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, గుత్తి, అనంతపురరం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా యల్హంకకు చేరుతుందన్నారు.

ప్యాసింజరు రైళ్ల రద్దు

కర్ణాటకలోని బళ్లారి, తోరణగల్లు స్టేషన యార్డుల్లో జరుగుతున్న ఎలెకి్ట్రకల్‌, సిగ్నలింగ్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన పనుల వల్ల గుంతకల్లు మీదుగా వెళ్లే పలు ప్యాసింజరు రైళ్లను రద్దు పరచినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు-చిగ్జాజుర్‌-గుంతకల్లు ప్యాసింజరు (57415/16) రైలును సెప్టెంబరు 3న రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పాక్షికంగా రద్దయిన రైళ్లు

తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజరు (57405)ను సెప్టెంబరు 2న, దీని తిరుగు ప్రయాణపు రైలు (57405)ను సెప్టెంబరు 3న గుంతకల్లు-కదిరిదేవరపల్లి సెక్షనలో రద్దుపరచి, కేవలం గుంతకల్లు-తిరుపతి మధ్యన నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హుబ్లి-గుంతకల్లు ప్యాసింజరు (56911) రైలును, దీని తిరుగు ప్రయాణపు రైలు (56912)ను సెప్టెంబరు 3న గుంతకల్లు-మునీరాబాద్‌ సెక్షనలో రద్దుపరచి, మునీరాబాద్‌-హుబ్లి సెక్షనలో మాత్రమే నడుపుతామన్నారు. హుబ్లి-తిరుపతి (57402) ప్యాసింజరును సెప్టెంబరు 3న గంటన్నరపాటు ఆలస్యంగా నడపనున్నట్లు వివరించారు.

నాందేడ్‌-ధర్మవరం రైలు రద్దు

హైదరాబాద్‌ రైల్వే డివిజనలో వర్షపు నీరు ట్రాక్‌పై ప్రవహించిన కారణంగా నాందేడ్‌-ధర్మవరం-నాందేడ్‌ స్పెషల్‌ ఫేర్‌ ఎక్స్‌ప్రె్‌సను ఒక ట్రిప్పు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాందేడ్‌-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ (07189) రైలును 29న దీని తిరుగు ప్రయాణపు రైలు (07190)ను ఈ నెల 31న రద్దుపరచినట్లు తెలియజేశారు.

Updated Date - Aug 30 , 2025 | 12:25 AM