meeting 27న చేతివృత్తిదారుల సమావేశం
ABN , Publish Date - May 23 , 2025 | 10:58 PM
పట్టణంలోని మంగళవారం చేతివృత్తిదారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు తెలిపారు.
ధర్మవరం, మే 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మంగళవారం చేతివృత్తిదారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు తెలిపారు. శుక్రవారం వారు స్థానిక ఎన్టీఓహోం కార్యాలయ ఆవరణంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తిదారులపై నిర్లక్ష్యం వీడాలన్నారు. రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, వడ్రంగి, గొర్లపెంపకం, గీత కార్మికులు, మత్య్సకారులు చేతివృత్తిదారులు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వాల తీరును నిరసిస్తూ చేతివృత్తిదారుల కోసం పోరాటాలు సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమయ్య, జిల్లా అధ్యక్షుడు నాగప్ప పాల్గొన్నారు.