కేబుల్ దొంగలను అరెస్ట్ చేయండి
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:48 PM
మండలంలోని వెన్నపూసపల్లిలో పది రోజుల్లోనే సుమారు 30 మంది రైతులకు చెందిన పొలాల్లోని కేబుల్ చోరీ అయిందని, ఆ దొంగలను అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ బోగాతి ప్రతాప్‌రెడ్డి, బాధిత రైతులు ఎస్‌ఐ రామాంజనేయ రెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేశారు.
యల్లనూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెన్నపూసపల్లిలో పది రోజుల్లోనే సుమారు 30 మంది రైతులకు చెందిన పొలాల్లోని కేబుల్ చోరీ అయిందని, ఆ దొంగలను అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ బోగాతి ప్రతాప్‌రెడ్డి, బాధిత రైతులు ఎస్‌ఐ రామాంజనేయ రెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఒక్కొక్క బోరు నుంచి సుమారు 50 మీటర్ల వరకు వైర్ చోరీ అయిందని, మీటర్ వైరు ధర సుమారు 300 ఉందని వాపోయారు. అంతేకాకుండా లోపల నుంచి వైర్ లాగడంతో తిరిగి మోటార్‌కు వైరు మార్చుకోవడానికి మోటార్‌ను బయటకు తీయాల్సిన వస్తోందని, దీనికి అదనంగా రూ. 5వేలు ఖర్చు అవుతోందని అన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక తోటలో ఇలా చోరీలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.