Share News

అక్రమాలు తేలేనా..?

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:55 PM

జడ్పీ కార్యాలయంలో ఏజీ ఆడిట్‌ టీమ్‌ మకాం వేసింది. ముగ్గరు అధికారులతో కూడిన బృందం ఆడిట్‌ ప్రక్రియ మొదలు పెట్టింది. 2019 - 2020 నుంచి 2024-2025 ఆర్థిక సంవత్సరం వరకు పలు పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల వివరాలు పరిశీలిస్తున్నారు. వాటిలో ఏవైనా పొరపాట్లు ఉంటే అందుకు అనుగుణంగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నారు.

అక్రమాలు తేలేనా..?

జడ్పీలో ఏజీ ఆడిట్‌ టీమ్‌.. పదిరోజులపాటు మకాం

నెలరోజులు అనుబంధ శాఖల్లో ఆడిటింగ్‌

పలు శాఖల్లో అధికారులను సంప్రదించిన టీమ్‌..

అనంతపురం న్యూటౌన, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జడ్పీ కార్యాలయంలో ఏజీ ఆడిట్‌ టీమ్‌ మకాం వేసింది. ముగ్గరు అధికారులతో కూడిన బృందం ఆడిట్‌ ప్రక్రియ మొదలు పెట్టింది. 2019 - 2020 నుంచి 2024-2025 ఆర్థిక సంవత్సరం వరకు పలు పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల వివరాలు పరిశీలిస్తున్నారు. వాటిలో ఏవైనా పొరపాట్లు ఉంటే అందుకు అనుగుణంగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. జడ్పీలోనే పది రోజులు ఉండి క్షుణంగా పరిశీలించనున్నారు. అనంతరం మరో నెల పాటు అనుబంధ శాఖలకు సంబంధించి ఆడిట్‌ నిర్వహించనున్నారు. బృందంలోని ఒక్కొక్కరు జడ్పీ సిబ్బందిని వెంటబెట్టుకొని మంగళవారం జిల్లా ఆడిట్‌ విభాగం సిబ్బందిని కలిసి, సంబంధిత రికార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అక్కడి నుంచి జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళ్లి పనులకు సంబంధించి సెస్‌ చెల్లింపుల రికార్డులు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడ అధికారులకు సంబంధించి పలు రికార్డులు సిద్ధం చేయాలని సూచించారు. అక్కడి నుంచి మైనింగ్‌ తదితర విభాగాలను కూడా సంప్రదించి రికార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత అంటేనే అక్రమాలకు నిలయం అన్న ప్రచారం ఉంది. రెగ్యులర్‌ సీఈఓ, డిప్యూటీ సీఈఓలు లేకపోవడంతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బందికి ఎవరి వాటాలు వారికి ముట్టచెప్పి పెద్దఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. అధికారుల అక్రమాలను పాలకులు సీరియ్‌సగా తీసుకోకపోవడంతో వారు అడ్డు, అదుపులేకుండా ఎక్కడి సొమ్ము అక్కడ దిగమింగేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీఎల్‌డీఓగా ఉన్న ఓ మహిళా అధికారికి ఇనచార్జ్‌ సీఈఓ బాధ్యతలు కట్టబెట్టడంతో బినామి పేర్లతో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. వీటిపై పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పిర్యాదులు కూడా వెళ్లాయి. ప్రస్తుతం ఏజీ ఆడిట్‌కు రావడంతో ఉద్యోగుల్లో బదిలీ అయినా సరే తీవ్ర ఆందోళన నెలకొంది. ఏజీ ఆడిట్‌ టీమ్‌ను కూడ మ్యానేజ్‌ చేసి ఘనులు జడ్పీలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.ఊరెళ్తున్నారా..? ఇల్లు జాగ్రత్త..!దసరా సెలవుల్లో చోరీలు జరిగే ప్రమాదం

Updated Date - Sep 23 , 2025 | 11:55 PM