Share News

అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:11 AM

సమస్యల పరిస్కారం కోసం ప్రజాగ్రీవెన్సులో ప్రజలు సమర్పించిన అర్జీలకు తక్షణ పరిస్కారం చూపాలని సంబంధిత అదికారులను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్లాయంలో నిర్వహించిన ప్రజాగ్రీవెన్సులో ఎమ్మెల్యే, మాజీమంత్రి నియోజకవర్గ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలి
MLA and former minister receiving complaints

పుట్టపర్తిరూరల్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిస్కారం కోసం ప్రజాగ్రీవెన్సులో ప్రజలు సమర్పించిన అర్జీలకు తక్షణ పరిస్కారం చూపాలని సంబంధిత అదికారులను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్లాయంలో నిర్వహించిన ప్రజాగ్రీవెన్సులో ఎమ్మెల్యే, మాజీమంత్రి నియోజకవర్గ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను పరిశీలించి గ్రీవెన్సులో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చిత్తశుద్ధితో పరిస్కరించాలని సూచించారు. రెవెన్యూ, ఆస్తివివాదాలు, డ్రైనేజ్‌లోపాలు, కొత్తసీసీరోడ్లు, పింఛన్లు, పక్కాగృహాల మంజూరు తదితరవాటిపై ఫిర్యాదు అందాయి.

రైతుల సంక్షేమమే సీఎం ఆశయం: రైతుల సంక్షేమమే సీఎం చంద్రబాబు ఆశయమని ఎమ్మెల్యే పల్లెసిఇంధూరారెడ్డి అన్నారు. శుక్రవారం జి ల్లాకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం రైతులు 140 మందికి 280 యూరియా బస్తాలను ఆమె అందచేశారు. ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ప్రతిరైతుకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా ఉన్నాయన్నారు. మాజీమంత్రి పల్లె రఘనాధరెడ్డి మాట్లాడుతూ ఇది నిజమైన రైతుప్రభుత్వమని, ఇప్పటికే అన్నదాత సుఖీభవ-పీఎంకిసాన పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో రూ.14వేలు జమ చేశారన్నారు. సొసైటీ అధ్యక్షుడు వెంకటరాముడు, సీఈఓ రవిశంకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:11 AM