నెట్టికంటి సేవలో ఏపీ దేవదాయశాఖ రాష్ట్ర స్థపతి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:15 AM
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని ఆంధ్రప్రదేశ దేవదాయ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్పస్వా మి గురువారం దర్శించుకున్నారు.
గుంతకల్లుటౌన, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని ఆంధ్రప్రదేశ దేవదాయ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్పస్వా మి గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారు లు, వేదపండితులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో రాతితో నిర్మించనున్న గర్భాలయం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, కర్నూలు స్థపతి సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.