వైభవంగా ఆంజన్న రథోత్సవం
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:45 AM
మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి రథోత్సవం ఆదివారం భారీ జనసందోహం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. శ్రావణ మాసం నాల్గో శనివారం తర్వాత స్వామి వారి ఉత్సవం, రథోత్సవం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ...
బొమ్మనహాళ్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి రథోత్సవం ఆదివారం భారీ జనసందోహం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. శ్రావణ మాసం నాల్గో శనివారం తర్వాత స్వామి వారి ఉత్సవం, రథోత్సవం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గంగాజలం తెచ్చి స్వామికి అభిషేకం చేసి ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఉంచి ఊరేగించారు. ముందుగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన మోహనరెడ్డి రథానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆంరఽధ, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని రథోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునివేలు, ఈవో నరసింహరెడ్డి. సింగిల్‌విండో చైర్మన మల్లికార్జున, నాయకులు మల్లికార్జున, అప్పారావు, కాశీనాథ్‌శెట్టి, బసప్ప, హనుమంతరెడ్డి, రమేష్, గాదిలింగ, అనిల్, మల్లన్న, నాగరాజు పాల్గొన్నారు.