Anganwadi సమస్యలపై అంగనవాడీల ధర్నా
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:36 AM
తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ధర్నా చేపట్టారు.

ధర్మవరం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ధర్నా చేపట్టారు. సీఐటీయూ మండల కన్వీనర్ జేవీ రమణ, కో-కన్వీనర్ అయూబ్‌ఖాన మాట్లాడుతూ.. ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీ హెల్పర్ల సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని, అయినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మినీ వర్కర్లు మెయిన వర్కర్లుగా జీవోలు విడుదల చేయాలని కోరారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీఓ మహేశకు అందజేశారు. ఇందులో అంగనవాడీలు చంద్రకళ, పోతక్క, దీన, సునీత, వేదవతి, గంగరత్న, చిట్టెమ్మ, సరస్వతి పాల్గొన్నారు.