సమస్యలపై అంగనవాడీల ఆందోళన
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:08 AM
అంగనవాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన సీఐటీయూ ఆధ్వర్యంలో అశోక్‌ఫిల్లర్ వద్ద నిరసన కార్యక్ర మం నిర్వహించారు.
తాడిపత్రి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): అంగనవాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన సీఐటీయూ ఆధ్వర్యంలో అశోక్‌ఫిల్లర్ వద్ద నిరసన కార్యక్ర మం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆందోళన లో భాగంగా వారీ కార్యక్రమాన్ని చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని, 1810 మినీ వర్కర్లకు విద్యార్హతలో వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే బెళుగుప్ప, కుందుర్పి, గుత్తి, యల్లనూ రు, కణేకల్లు, యాడికి, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు ప్రాంతాల్లోనూ ఆందోళన చేపట్టారు.