Share News

education sector విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటం

ABN , Publish Date - Dec 11 , 2025 | 02:05 AM

విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థిబ్లాక్‌ జాతీయ కన్వీనర్‌ బాలజయవర్దన, పార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీవీసుందరరామరాజు పేర్కొన్నారు. అఖిలభారతవిద్యార్థిబ్లాక్‌ 3వ రాష్ట్రమహాసభలు బుధవారం వారు నగరంలో నిర్వహించారు.

education sector విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటం

అనంతపురం విద్య, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థిబ్లాక్‌ జాతీయ కన్వీనర్‌ బాలజయవర్దన, పార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీవీసుందరరామరాజు పేర్కొన్నారు. అఖిలభారతవిద్యార్థిబ్లాక్‌ 3వ రాష్ట్రమహాసభలు బుధవారం వారు నగరంలో నిర్వహించారు.


తొలుత స్థానిక విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం లలితకళా పరిసతలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యారంగ పరిరక్షణతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు విద్యార్థి సంఘాల పోరాటాలతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాయని చెబుతున్నా.. అమలులో ఏమార్పు లేదన్నారు. వెంటనే విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సబీ జిల్లా ప్రధానకార్యదర్శి పృధ్వీ, నాయకులు రాజేంద్రప్రసాద్‌, పోతులయ్య, చంద్రశేఖరరెడ్డి, రామచంద్ర వివిధ జిల్లాల ప్రతినిథులు, విద్యార్థులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Dec 11 , 2025 | 02:05 AM