పేదలందరికీ సొంతిళ్లు: విప్
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:43 AM
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని విప్ కాలవ శ్రీనివాసులు స్పష్టంచేశారు.
రాయదుర్గం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని విప్ కాలవ శ్రీనివాసులు స్పష్టంచేశారు. మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పక్కా ఇళ్లను బుధవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. పేదల గృహనిర్మాణ పథకా న్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశలు మళ్లీ చిగురించాయని అన్నారు.