రోడ్డు విస్తరణకు చర్యలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:58 PM
స్థానిక పెట్రోల్ బంక్ నుంచి కస్తూరిభా పాఠశాల వరకు ఉన్న రోడ్డును 60 అడుగుల మేర విస్తరించే పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు.
కుందుర్పి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక పెట్రోల్ బంక్ నుంచి కస్తూరిభా పాఠశాల వరకు ఉన్న రోడ్డును 60 అడుగుల మేర విస్తరించే పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. కళ్యాణదుర్గం డివిజన రోడ్ల భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న భవనాలకు మార్కింగ్ వేయించారు. ఐదు రోజుల క్రితం మండలంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించగా.. రోడ్డు సమస్య పరిష్కరించాలని స్థానికులు ఆయన్ను కోరారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఈ విస్తరణ పనులు చేపట్టారు.