Jagana Media జగన మీడియాపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:33 AM
వేశ్యల రాజధాని అమరావతి అంటూ వ్యాఖ్యానించిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై, దీన్ని ప్రసారం చేసిన జగన చానల్, ప్రచురించిన జగన పత్రికపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, బీజేపీ, జనసేన మహిళలు డిమాండ్ చేశారు.

గుంతకల్లు టౌన, జూన 9(ఆంధ్రజ్యోతి): వేశ్యల రాజధాని అమరావతి అంటూ వ్యాఖ్యానించిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై, దీన్ని ప్రసారం చేసిన జగన చానల్, ప్రచురించిన జగన పత్రికపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, బీజేపీ, జనసేన మహిళలు డిమాండ్ చేశారు. స్థానిక అజంతా సర్కిల్‌లో సోమవారం సాయంత్రం కూటమి మహిళలు జగన పత్రికలను దహనం చేశారు. ఇందులో టీడీపీ తెలుగు మహిళలు తలారిసరోజమ్మ, ఉమాదేవి, అంజలి, నాగరత్న, ఇందిరమ్మ, చిట్టమ్మ, బీజేపీ నాయకురాలు వీ విజయలక్ష్మి, శ్రీదేవి, పద్మా, లావణ్య, జనసేన నాయకురాలు బండి చంద్రకళ, ఈరమ్మ పాల్గొన్నారు.