Share News

ఉత్సాహంగా బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:02 AM

స్థానిక భోగేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాల ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారోత్సవం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగింది

ఉత్సాహంగా బాధ్యతల స్వీకరణ
పామిడిలో ఎమ్మెల్యే, ప్రముఖులతో ధర్మకర్త మండలి సభ్యులు

పామిడి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక భోగేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాల ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారోత్సవం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మనగా పోలేపల్లి భారతి, సభ్యులుగా గోరంట్ల జయప్రధ, పసువుల రామలక్ష్మి, నల్లబోతుల లత, పసుపులేటి సురేష్‌, పెమ్మక స్వామినాథరెడ్డి, వడుగూరు వెంకట రమణ, వడ్డే రామాంజనేయులు, దుస్తఖర్‌ పవన కుమార్‌తో ఆలయ ఇనస్పెక్టర్‌ రాణి, ఈఓ క్రిష్ణయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... అన్ని కులాల వారితో కమిటీ వేశామని, ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Updated Date - Aug 22 , 2025 | 12:02 AM