ఆవిష్కరణల కార్ఖానా..!
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:47 AM
ఆవిష్కరణల ఆలోచన మీదైతే పెట్టుబడి మాది. మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. స్వర్ణాంధ్ర-2047 కలను సాకారం చేసుకుందాం’ అని యువతకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేసే దిశగా ‘రతన టాటా ఇన్నొవేషన సెంటర్’ను నగరంలోని జేఎనటీయూలో ఏర్పాటు .,..
జేఎనటీయూలో రతన టాటా ఇన్నొవేషన సెంటర్
స్టార్టప్‌లకు ప్రోత్సాహం.. యువతకు మెరుగైన శిక్షణ
నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు
అనంతపురం రూరల్/వైద్యం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ‘ఆవిష్కరణల ఆలోచన మీదైతే పెట్టుబడి మాది. మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. స్వర్ణాంధ్ర-2047 కలను సాకారం చేసుకుందాం’ అని యువతకు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేసే దిశగా ‘రతన టాటా ఇన్నొవేషన సెంటర్’ను నగరంలోని జేఎనటీయూలో ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు వర్చువల్‌గా బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం పర్యవేక్షించారు. జేఎన్టీయూలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఇదే లక్ష్యం..
స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు రతన టాటా ఇన్నోవేషన హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురంలోని ఇన్నొవేషన సెంటర్‌కు కియ, జేఎ్‌సడబ్ల్యూ సంస్థల ప్రతినిధులను ప్రచారకర్తలుగా అనుసంధానం చేశారు. సెంటర్ నిర్వహణకోసం సెక్షన-8 కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక సొసైటీని ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉంటారు.
ఆలోచన ఉండాలంతే..
ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అంశాలను జేఎన్టీయూ పర్యవేక్షిస్తుంది. శిక్షణ పొందిన వారికి ఎలాంటి అవకాశాలు కల్పించాలనేది పారిశ్రామికవేత్తలు నిర్ణయిస్తారు. ఇండస్ర్టీ, యూనివర్సిటీ సంయుక్తంగా ఇన్నొవేషన హబ్ నిర్వహిస్తాయి. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని అందుకోనున్నారు. ఏ రంగంలోనైనా కొత్త ఆవిష్కరణ ఆలోచన ఉన్న విద్యార్థులు దీనికి అర్హులు. ఇంజనీరింగ్, బీఎస్సీ, బీకామ్ తదిర డిగ్రీలున్న విద్యార్థులే కాకుండా కొత్త విషయాలపై ఆలోచనా సామర్థ్యం మెండుగా ఉండి, సమాజానికి అందించగలనన్న సంకల్పం ఉంటేచాలు అవకాశం కల్పిస్తారు.
స్కిల్ డెవల్‌పమెంట్..
స్కిల్ డెవల్‌పమెంట్ స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు ఈ సెంటర్ కేంద్రంగా పనిచేయనుంది. యువతకు నైపుణ్య శిక్షణ, వినూత్న ఆలోచనలకు ప్రోత్సహించడం, స్టార్ట్‌పలకు మద్దతు ఇవ్వడం, ఉపాధి అవకాశాలను సృష్టించడమే దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టులో గ్రీనకో ఎనర్జీ, ఓఎనజీసీ, అవంతి గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. సెంటర్ నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక బాధ్యత కింద ప్రముఖ పారిశ్రామిక సంస్థలు నిధులను సమకూరుస్తాయి.
యువతకు శిక్షణ
వ్యక్తి వికాసం, నైపుణ్యాభివృద్ధి, పోటీతత్వం వంటి అంశాలలో యువతకు శిక్షణ ఇస్తారు. పౌర సేవలందించే ప్రభుత్వ కార్యక్రమాలలోనూ ఆర్‌టీఐహెచ భాగస్వామ్యంగా ఉండనుంది. భవిష్యత్తు టెక్నాలజీలైన క్వాంటమ్‌వ్యాలీ, ఏఐ వంటి వాటిల్లో స్టార్ట్‌్‌పలకు సహకారం అందిస్తుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ సేవలు అందిస్తుంది. టైక్స్‌టైల్ ఇన్నొవేషన, ఇంధనం, పునరుత్పాదక ఇంధన రంగాలు, ఫార్మా రంగాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.
అవకాశాలకు అడుగులు...
రతన టాటా ఇన్నొవేషన కేంద్రం ప్రారంభంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అడుగులు పడనున్నాయి. విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తును అందించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ చర్యలు చేపట్టారు. విద్యార్థులో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
-ప్రొఫెసర్ సుదర్శనరావు, జేఎన్టీయూ వీసీ