Share News

భగతసింగ్‌కు ఘన నివాళి

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:20 AM

స్వాతంత్ర సమరయోధుడు భగతసింగ్‌ జయంతి సందర్భంగా స్థానిక బీటీ పక్కీరప్ప భవనంలో ఏఐఎ్‌సఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఆదివారం పలువురు నివాళులర్పించారు.

భగతసింగ్‌కు ఘన నివాళి
భగతసింగ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

గుంతకల్లుటౌన, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర సమరయోధుడు భగతసింగ్‌ జయంతి సందర్భంగా స్థానిక బీటీ పక్కీరప్ప భవనంలో ఏఐఎ్‌సఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి ఆదివారం పలువురు నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు డీ జగదీష్‌ మాట్లాడుతూ.. దేశం కోసం చిన్న వయస్సులోనే ప్రాణాలను సైతం త్యాగం చేసిన భగతసింగ్‌ ఆదర్శప్రాయుడన్నారు. అలాగే డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న భగతసింగ్‌ విగ్రహనికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Sep 29 , 2025 | 12:20 AM