ఐలమ్మకు ఘన నివాళి
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:50 PM
చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీసర్కిల్‌లో బుధవారం ఆమె చిత్రపటానికి చేతివృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పలువురు నివాళులర్పించారు.
తాడిపత్రి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీసర్కిల్‌లో బుధవారం ఆమె చిత్రపటానికి చేతివృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పలువురు నివాళులర్పించారు. తెలంగాణాలో సాయుధ పోరాటంలో ఐలమ్మ కీతల పాత్ర పోషించిందని స్మరించుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవియాదవ్, నాయకులు శ్రీరాములు, నాగేంద్ర, రంగనాథ్, గురునాథ్, గురుప్రసాద్, సుబ్రహ్మణ్యం, ఓబులేసు, వీరన్నారాయణ, తిరుపాల్ పాల్గొన్నారు.