ONLINE VISIT: టైమింగ్ లేని ట్రెజరీ..!
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:21 AM
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఆ కార్యాలయం వద్దకే వెళ్లాలి. నెల జీతాల నుంచి పెద్ద బిల్లుల వరకు అక్కడి వారే పరిష్కారం చూపాలి. కలెక్టరేట్ కిందే ఉన్నా వారిని పర్యవేక్షించే వారే కరువయ్యారు.
సమయపాలన లేని అధికారులు, ఉద్యోగులు
అనంతపురం కలెక్టరేట్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఆ కార్యాలయం వద్దకే వెళ్లాలి. నెల జీతాల నుంచి పెద్ద బిల్లుల వరకు అక్కడి వారే పరిష్కారం చూపాలి. కలెక్టరేట్ కిందే ఉన్నా వారిని పర్యవేక్షించే వారే కరువయ్యారు. అదే ఖజానా(ట్రెజరీ)శాఖ కార్యాలయం. ఆర్థిక పరమైన లెక్కల వ్యవహారాలన్నీ ఇక్కడే తేల్చుకోవాలి. మాన్యువల్ విధానంలో ఉన్న సమయంలో బిల్లుల కోసం అక్కడే ఉండేవారు. సీఎ్‌ఫఎంఎస్ విధానం వచ్చాక కూడా వారికున్న డి మాండ్ తగ్గడం లేదు. బిల్లులు కావాలంటే వీరు ఆనలైనలో ఓకే చేస్తేనే చెల్లింపులయ్యేది. ఇలాంటి కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలున్నాయి.
ఇనచార్జి రారు... సిబ్బంది సమయపాలన పాటించరు..
ఇంతటి ప్రాధాన్యం ఉన్న కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు విధులు సరిగా నిర్వర్తించడం లేదు. గురువారం ఆంధ్రజ్యోతి పరిశీలనలో కొన్ని సీట్లు ఖాళీగా కనిపించాయి. ఖజానా శాఖ ఇనచార్జి డిప్యూటీ డైరెక్టర్(ఎ్‌ఫఏసీ)గా కడప జిల్లా ట్రెజరీ శాఖ డీడీని నియమించారు. కానీ ఈయన ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. అక్కడున్న సిబ్బంది వారానికోసారి వస్తుంటారని చెబుతారు. దీంతో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం ఉదయం 11గంటలైనా ఆఫీ్‌సకు రాలేనంత బిజీగా ఉన్నారు. ఏటీఓ, ఎస్‌టీఓ అధికారులు సీనియర్ అకౌంటెంట్లు సీట్లు ఖాళీగా కనిపించాయి. వీరిలో కొందరు తీరిగ్గా అంటే 11గంటల తరువాత వచ్చి డీడీ చాంబర్‌లో ఉన్న రిజిస్టర్ సంతకాలు చేసి వారిసీట్లలో ఆసీనులయ్యారు. ఎక్కువ సమయం ఆ సీట్లలో కూర్చోరనే విమర్శలున్నాయి.