Share News

culvert ప్రధాన రహదారిలో కుంగిన కల్వర్టు

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:27 PM

మండలంలోని కదిరి, రాయ చోటి ప్రధాన రహదారిలో రెక్కమాను వద్ద కాల్వర్టు కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది.

culvert  ప్రధాన రహదారిలో కుంగిన కల్వర్టు
రెక్కమాను రహదారిపై కుంగిన కల్వర్టు

గాండ్లపెంట, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని కదిరి, రాయ చోటి ప్రధాన రహదారిలో రెక్కమాను వద్ద కాల్వర్టు కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో అనేక ప్రమా దాలు జరిగాయి. దీంతో సమీప గ్రామస్థులు వాహనదారులకు ఆ గుంత చుట్టూ చిన్నపాటి రాళ్లను ఏర్పా టు చేశారు. అయినా రాత్రి సమయంలో నూతన వాహన దారులు ప్రమాదాలకు గురవు తున్నారు. భారీ వాహనాలు ఓవర్‌టేక్‌ సమయంలో ఈ గుంత వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అఽధికారులు స్పందించి కల్వర్టుకు మరమ్మతులు చేసి, గుంతను పూడ్చి వేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్ధులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:27 PM