Share News

రెగ్యులర్‌ తహసీల్దారును నియమించాలి

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:08 AM

కూడేరు మండలానికి రెగ్యులర్‌ తహసీల్దారును నియమించాలని సీపీఐ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు సోమవారం ఆందోళన చేపట్టారు.

రెగ్యులర్‌ తహసీల్దారును నియమించాలి
రాస్తారోకో చేస్తున్న సీపీఐ నాయకులు

కూడేరు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి) : కూడేరు మండలానికి రెగ్యులర్‌ తహసీల్దారును నియమించాలని సీపీఐ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు సోమవారం ఆందోళన చేపట్టారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దాదాపు గంట పాటు రాస్తారోకో జరగడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఏఎ్‌సఐ రామానాయుడు ఆందోళనకారులతో చర్చించారు. డిప్యూటి తహసీల్దారు ఉదయ్‌భాస్కర్‌ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో సీపీఐ నాయకులు మల్లికార్జున, పెరుగుసంగప్ప, పార్వతీప్రసాద్‌, నాగేంద్ర, రమణ, శ్రీరాములు, నారాయణమ్మ, రమణప్ప, ప్రసాద్‌, మలరాయుడు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 12:08 AM