రెగ్యులర్ తహసీల్దార్‌ను నియమించాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:06 AM
మండలానికి రెగ్యులర్ తహసీల్దార్‌ను నియమించాలని రైతులు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు
విడపనకల్లు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలానికి రెగ్యులర్ తహసీల్దార్‌ను నియమించాలని రైతులు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. తొమ్మిది నెలలుగా రెగ్యులర్ తహసీల్దార్ లేడని, ఇనచార్జ్‌లు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని వాపోయారు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం రైతులు, విద్యార్థులు నెలలు తరబడి కార్యాలయం చుట్టు తిరుగుతున్నారన్నారు. రెగ్యులర్ తహసీల్దారు లేకపోవటంతో కార్యాలయ ఉద్యోగులు కూడా విధులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అనంతరం డిప్యూటి తహసీల్దారుకు వినతి పత్రాన్ని అందించారు. ఇందులో రైతులు కెంగూరి ఎర్రిస్వామి, రంగస్వామి పాల్గొన్నారు.