SATYASAI: మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:09 AM
భగవాన సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం పుట్టపర్తి విమానశ్రయానికి చేరుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీ్‌సకు బీజేపీ నాయకులు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు.
పుట్టపర్తి టౌన, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): భగవాన సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం పుట్టపర్తి విమానశ్రయానికి చేరుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీ్‌సకు బీజేపీ నాయకులు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. నెహ్రూ యువ కేంద్రం జాతీయ వైస్ చైర్మన విష్ణువర్ధన రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎస్పీ సతీ్‌షకుమార్ సీఎంకు పుష్పగుచ్చంతో ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయం చేరుకున్న సీఎం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఏర్పాటు చేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.