Share News

ఘనంగా కల్యాణోత్సవం

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:28 AM

స్థానిక తగ్గుదేవాలయంలో అనంత గజగరుడ లక్ష్మీనారాయణస్వామి, శ్రీదేవి, భూదేవి కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు

ఘనంగా కల్యాణోత్సవం
కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు

పామిడి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక తగ్గుదేవాలయంలో అనంత గజగరుడ లక్ష్మీనారాయణస్వామి, శ్రీదేవి, భూదేవి కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఏటా మార్గశిర మాసం మొదటి ఆదివారం రాత్రి ఇలా కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తల్లం ప్రకాష్‌, శివకేశవ దంపతులు కల్యాణ కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సాయిప్రకాష్‌, పురాణ ప్రవచకులు భాస్కరరావు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 12:28 AM