Share News

ceremony అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:08 AM

స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ కమిటీ ఛైర్మనగా ఉండాల హనుమంతరెడ్డి, పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం అట్టహాసంగా సాగింది

ceremony అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
ఎనటీఆర్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కాలవ, ఉండాల హనుమంతరెడ్డి

రాయదుర్గం, జూన 8(ఆంధ్రజ్యోతి): స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ కమిటీ ఛైర్మనగా ఉండాల హనుమంతరెడ్డి, పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం అట్టహాసంగా సాగింది. వీరితో మార్కెట్‌యార్డ్‌ కార్యదర్శి శ్రీనివాసులు ప్రమాణం చేయించారు. అనంతరం వీరిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం సహకారం.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. వీరి స్ఫూర్తితో నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మరిన్ని చేపట్టబోతున్నామని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడుయాదవ్‌ మాట్లాడుతూ.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డ కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, హనుమంతరెడ్డే అందకు సాక్ష్యమని కొనియాడారు. ఛైర్మన హనుమంతరెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధి చేస్తామన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:08 AM