ఘనంగా వెండి వినాయక విగ్రహం ఊరేగింపు
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:06 AM
వినాయక చవితి పండుగను పరష్కరించుకుని అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో వరసిద్ది వెండి వినాయక విగ్రమాన్ని ఊరేగించారు.
గుంతకల్లుటౌన, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పండుగను పరష్కరించుకుని అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో వరసిద్ది వెండి వినాయక విగ్రమాన్ని ఊరేగించారు. మంగళవారం శాశ్వత విగ్రహ సేవాదాతలు పువ్వాడి చంద్రశేఖర్ స్వగృహం నుంచి వెండి వినాయకుడిని పల్లకిలో కొలువు దీర్చి మేళాతాళలతో కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం వెండి విగ్రహానికి అభిషేకం, 108 వెండి పుష్పాలతో అర్చన, ఉంజల్ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.