వైభవంగా రథోత్సవం
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:24 AM
వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల గ్రామంలో ఆదిచెన్నకేశవస్వామి రథోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.
ఉరవకొండ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల గ్రామంలో ఆదిచెన్నకేశవస్వామి రథోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి రథంలో ఉంచారు. ఉదయం మడుగుతేరును నిర్వహించారు. సాయంత్రం ఉట్ల ఉత్సవం అనంతరం రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి గ్రూప్ టెంపుల్ అధికారి కృష్ణయ్య పాల్గొన్నారు.