ఉల్లాసంగా ఉట్టికొట్టే కార్యక్రమం
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:06 AM
మండలంలోని ఆమిద్యాల గ్రామం లో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని గురువారం ఉత్సాహంగా నిర్వహించారు.
ఉరవకొండ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆమిద్యాల గ్రామం లో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పెన్నహోబిలం నుంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఉట్ల మాను వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువకులు ఉట్టికొట్టేందుకు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు.