Share News

job fair మెగా జాబ్‌మేళాలో 67 మందికి ఉద్యోగాలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:26 PM

స్థానిక సాయిరాం ఐటీఐ కళాశాలలో మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ఆదేశాల మేరకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు.

job fair మెగా జాబ్‌మేళాలో 67 మందికి ఉద్యోగాలు
నియామక పత్రాలతో యువతీ, యువకులు

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సాయిరాం ఐటీఐ కళాశాలలో మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ఆదేశాల మేరకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఇందులో 11 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబ్‌మేళాలో 110మంది యువతీ, యువకులు హాజరుకాగా.. 67 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బీజేపీ నియోజకవర్గ ఇనచార్జి హరీ్‌షబాబు మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన యువతీ, యువకులు బాగా రాణించి భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్లేస్‌మెంట్‌ అధికారి తేజ్‌కుమార్‌, పలు కంపెనీల ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:26 PM