collector కలెక్టర్‌కు 461 అర్జీలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:49 AM
కలెక్టర్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. 461 మంది నుంచి అర్జీలు స్వీకరించారు.
యాడికి, జూన 16(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. 461 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. బదిలీ అయిన జిల్లా అధికారులు, ఇతర అధికారులు వెంటనే వారి స్థానాలకు వెళ్లి జాయిన కావాలని కలెక్టర్ ఆదేశించారు. యాడికిలో వైసీపీ నాయకులు గ్రావెల్ దందాపై చర్యలు చేపట్టాలని టీడీపీ నాయకులు, యాడికిలో హౌసింగ్ కాంట్రాక్టర్ లబ్ధిదారులతో డబ్బు లు కట్టించుకొని పనులు చేయలేదు, డబ్బులు వెనక్కి ఇవ్వలేదని పలువురు లబ్ధిదారులు, తనకు భూమి కేటాయించాలని గతంలో కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినా స్థానిక అధికారులు పట్టించుకోలేదని రత్నకుమారి అనే మహిళ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డయాలసిస్ పేషెంట్లకు సీడీఎస్ బ్యాగులు ఇవ్వడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యాడికి చెందిన నవీన అనే బాలుడు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశాడు. రైతుల అభ్యర్థన మేరకు యాడికి కాలువను కలెక్టర్ పరిశీలించారు. యాడికి కాలువకు అనుసంధాన పరుస్తూ ఉన్న చెక్‌డ్యాంలకు నీళ్లు అందేలా గేట్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. యాడికిలో ఆగిపోయిన హాస్పిటల్ భవనాన్ని పరిశీలించారు.