Share News

PGRS పీజీఆర్‌ఎస్‌కు 460 వినతులు

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:45 AM

ప్రజా సమస్యల పరి ష్కార వేదిక(పీజీఆర్‌ఎ్‌స)లో ప్రజలు వినతుల ద్వారా తెలియజేసిన సమస్యల్ని పెండింగ్‌ లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా ఇనచార్జి కలెక్టర్‌ శివ నారాయణశర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 460 వినతులు అందాయి. ఇన చార్జి కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచినరహార్‌, డీఆర్‌ఓ మలోల, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్‌, రామ్మోహన, మల్లికార్జునుడు, మల్లిఖార్జునరెడ్డి, పౌరసరఫరాలశాఖ డీఎం రమే్‌షరెడ్డి వినతులు స్వీకరించారు.

 PGRS పీజీఆర్‌ఎస్‌కు 460 వినతులు
వినతులు స్వీకరిస్తున్న ఇనచార్జ్‌కలెక్టర్‌ ఇతర అధికారులు

అనంతపురం కలెక్టరేట్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరి ష్కార వేదిక(పీజీఆర్‌ఎ్‌స)లో ప్రజలు వినతుల ద్వారా తెలియజేసిన సమస్యల్ని పెండింగ్‌ లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా ఇనచార్జి కలెక్టర్‌ శివ నారాయణశర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 460 వినతులు అందాయి. ఇన చార్జి కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచినరహార్‌, డీఆర్‌ఓ మలోల, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్‌, రామ్మోహన, మల్లికార్జునుడు, మల్లిఖార్జునరెడ్డి, పౌరసరఫరాలశాఖ డీఎం రమే్‌షరెడ్డి వినతులు స్వీకరించారు.


ఇందులో పలు వినతులను పరిశీలిస్తే.. బుక్కరాయసముద్రానికి చెందిన రమణమ్మ తన భర్తతో కలిసి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యపై అధికారులకు విన్నవించుకుంది. కార్యాలయాల చుట్టూ తిరిగి తన భర్త అనారోగ్యం క్షీణించిందని, న్యాయం చేయాలని కోరింది. అలాగే దశాబ్దాల కాలంగా లేని రస్తా కోసం కొందరు దౌర్జన్యం చేస్తున్నారని గుంతకల్లు మండలం వైటీ చెరువుకు చెందిన సుకన్య అధికారులకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని కోరింది. ఇక మహిళా సంఘాలకు చెందిన డబ్బు యానిమేటర్లు మేసేశారని పలువురు మహిళలు అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం రూరల్‌ మండలం ఆకుతోటపల్లికి చెందిన ఓ సంఘం పరిధిలో యానిమేటర్‌ రూ.30లక్షలు మోసం చేసిందని అధికారులకు వివరించారు. పామిడి మండల కేంద్రంలో ఓ వ్యక్తి రూ.12లక్షలు మహిళలకు అందకుండా వాడుకున్నాడని ఆరోపించారు. అదేవిధంగా సమగ్ర శిక్ష కార్యాలయంలో సెక్టోరియల్‌ అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ ఆఫీసర్‌ భర్తీలో స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని రిజర్వేషన సాధికారిక పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉజ్వల్‌ కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Aug 12 , 2025 | 01:45 AM