Share News

Adangal 1బి అడంగళ్‌ సమస్య పరిష్కరించండి

ABN , Publish Date - May 29 , 2025 | 10:55 PM

మండలంలో వివిధ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు 1బి, అడంగళ్‌ సమస్య ఉందని, దాన్ని వెంటనే పరిష్కరించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

Adangal  1బి అడంగళ్‌ సమస్య  పరిష్కరించండి
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న సీపీఎం నాయకులు

ముదిగుబ్బ, మే 29(ఆంధ్రజ్యోతి): మండలంలో వివిధ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు 1బి, అడంగళ్‌ సమస్య ఉందని, దాన్ని వెంటనే పరిష్కరించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్‌ నారాయణస్వామికి వినతిపత్రం అందజేశారు. సీపీఎం నాయకుడు ఆటో పెద్దన్న మాట్లాడుతూ... బ్యాంకుల్లోని వ్యవసాయ రుణాలకు 1బి తో పాటు అడంగళ్‌ను బ్యాంకు అధికారులు అడుగుతున్నారని, వాటిని మంజూరు చేయడంలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ ఖరీఫ్‌ సీజన్లో వందలాది మంది రైతులు బ్యాంకుల్లో భూములను తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారని, వాటిని కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి బండల వెంకటేష్‌, ఆవాజ్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి బాబ్జాన, రఫీ, బాబు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 10:55 PM