Childbirth 108 వాహనంలో ప్రసవం
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:30 AM
మండలంలోని ఎస్ బ్రాహ్మణపల్లికి చెందిన గర్భిణి శివమ్మకు బుధవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు.

ముదిగుబ్బ, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎస్ బ్రాహ్మణపల్లికి చెందిన గర్భిణి శివమ్మకు బుధవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఆ 108 వాహనంలో కదిరి ఆసుపత్రికి తరలిస్తుండగా.. నాగారెడ్డి గ్రామ సమీపంలోనే శివమ్మ ప్రసవించింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని 108 సిబ్బంది రవికుమార్, బాల ఓబిలేసు తెలిపారు.