CM Chandrababu: చంద్రబాబుపై కక్షతోనే అమరావతిపై ఆ వ్యాఖ్యలు చేశా
ABN , Publish Date - Jun 21 , 2025 | 05:05 AM
సీఎం చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మహిళల పట్ల ఆ వ్యాఖ్యలు చేశానని ఎనలిస్ట్ కృష్ణంరాజు చెప్పినట్లు తెలిసింది.
పోలీసు కస్టడీలో ఎనలిస్టు కృష్ణంరాజు వెల్లడి
గుంటూరు, జూన్ 20(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మహిళల పట్ల ఆ వ్యాఖ్యలు చేశానని ఎనలిస్ట్ కృష్ణంరాజు చెప్పినట్లు తెలిసింది. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఇటీవల సాక్షి టీవీ చానల్ డిబే ట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన్ను పోలీసులు అరె స్టు చేయడం .కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ప్రధాన నిందితుడైన ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించడం.. మూడ్రోజులపాటు కస్టడీలో విచారించేందు కు కోర్టు పోలీసులకు అనుమతివ్వడం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు ఆయన్ను శుక్రవారం జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందడంలోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించా రు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ సాగింది. ఆయన బ్యాం కు ఖాతాలో డబ్బుల జమ, ఆయన ఎవరెవరితో మాట్లాడారో ఆయా ఫోన్ నెంబర్ల జాబితా, ఆయన రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇచ్చిన వివరణకు సంబంధించిన పత్రిక క్లిప్పింగ్‌లను ఆయన ముం దుంచి.. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఇంకొందరు డీఎస్పీ లు, సీఐల బృందం సుదీర్ఘంగా విచారించింది. అయితే అనేక ప్రశ్నలకు కృష్ణంరాజు జవాబులు దాటవేశారు. సూటిగా సమాధానాలు చెప్పలేదని తెలిసింది.
రాజధానిపై కక్ష ఎందుకని ప్రశ్నించగా తనకు రాజధానిపై ఎటువంటి కక్షా లేదని, సీఎం చంద్రబాబుపై కోపంతోనే అలా మాట్లాడానని చెప్పినట్లు సమాచారం. తనకు మొదటి నుంచీ చంద్రబాబు అంటే కక్ష అని, తాను ఓ పత్రికలో జర్నలిస్టు గా పనిచేస్తున్న సమయంలో ఆయన తనను ఇబ్బందులకు గురి చేశారని బదులిచ్చినట్లు తెలిసింది. తొలుత చిత్తూరులో పనిచేశానని.. అక్కడ ఇబ్బంది పెట్టి హైదరాబాద్ మార్చారని, అక్కడి నుంచి తిరిగి అనంతపురానికి పంపారని, చివరకు అనంతపురంలో ఉద్యోగం నుంచి తీసేశారని.. వీటన్నింటికీ చంద్రబాబు కారణమని.. అందుకే ఆయనంటే తనకు కోపమని పేర్కొన్నట్లు తెలిసింది. మీ ఖాతాకు సాక్షి చానల్, వైసీపీ నాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా.. ఆ చానల్ యాజమాన్యం తనకు వేలల్లో డబ్బులు పారితోషికంగా ఇచ్చిందని జవాబిచ్చారు. అలాగే తన పత్రిక న్యూస్ అండ్ వ్యూస్‌కు, అదేవిధంగా ఏపీ టీవీ జర్నలిస్టు అనే యూట్యూబ్ చానల్‌కు వైసీపీ నాయకులు ప్రకటనలు ఇచ్చేవారని, ఆ ప్రకటనల తాలూకు డబ్బులు వారు తన ఖాతాలో జమ చేశారని చెప్పినట్లు తెలిసింది. ఐదేళ్లుగా ఆ చానల్లో విశ్లేషణలకు వెళ్తున్నట్లు సమాధానమిచ్చారు. కృష్ణంరాజును శని, ఆదివారాల్లో కూడా ప్రశ్నించనున్నారు.