Share News

కుణుతూరు జగనన్న ఇళ్ల పట్టాలపై విచారణ

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:04 AM

మండలంలోని కుణుతూరులో గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్‌లో అనర్హులకు పట్టాలిచ్చారనే ఆరోపణపై అధికారులు విచారణ చేపట్టారు.

కుణుతూరు జగనన్న ఇళ్ల పట్టాలపై విచారణ
లబ్ధిదారులను విచారిస్తున్న రెవెన్యూ అధికారులు

ధర్మవరంరూరల్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని కుణుతూరులో గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్‌లో అనర్హులకు పట్టాలిచ్చారనే ఆరోపణపై అధికారులు విచారణ చేపట్టారు. గురువారం బత్తలపల్లి డీటీ షణ్ముఖ ఆధ్వర్యంలో ఆర్‌ఐలు, సర్వేయర్లు, వీఆర్‌ఓలు ఆ లేఅవుట్‌కు వెళ్లారు. ఇళ్లపట్టాలను పరిశీలించారు. రికార్డుల ప్రకారం మొత్తం 163 మందికి అక్కడ పట్టాలిచ్చారు. అందులో 25 మంది పట్టాలను పరిశీలించి.. పొజిషన సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇక మిగిలిన వారిలో 25 మంది లబ్ధిదారులు పట్టాలు వైసీపీ నాయకుడి వద్దే ఉన్నాయని, తమకు ఇవ్వలేదని వాపోయారు. దీంతో వారు అధికారుల వద్ద నుంచే ఆ వైసీపీ నాయకుడి ఫోన చేశారు. రెండు రోజుల్లో పట్టాలు అందజేస్తానని ఆ వైసీపీ నాయకుడు సమాధనమిచ్చినట్లు లబ్ధిదారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రంలోగా పట్టాలు చూపాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.

Updated Date - Feb 14 , 2025 | 12:04 AM