games: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:59 PM
games:విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. మంగళవారం రణస్థలం జడ్‌పీ హైస్కూల్‌లో 77వ అంతర పాఠశాల జోనల్ గ్రిగ్స్ పోటీలను ప్రా రంభించారు.

రణస్థలం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. మంగళవారం రణస్థలం జడ్‌పీ హైస్కూల్‌లో 77వ అంతర పాఠశాల జోనల్ గ్రిగ్స్ పోటీలను ప్రా రంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసా నికి, శరీరదారుఢ్యానికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డీఈవో తిరుమలచైతన్య, ప్రధానోపాధ్యాయుడు బి.రమణయ్య, కూటమి నేతలు డీజీఎం ఆనందరావు, గొర్లె లక్ష్మణరావు, రౌతు శ్రీనివాసరావు, నారాయణశెట్టి శ్రీను, దన్నాన చిరంజీవి పాల్గొన్నారు.