Share News

Revenue Department: దుగ్గిరాల మాజీ తహసీల్దార్‌పై అభియోగాలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:44 AM

ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌లో ఈడీగా డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న సంగా విజయలక్ష్మిపై రెవెన్యూ(విజిలెన్స్‌-1) డిపార్టుమెంట్‌ అభియోగాలు నమోదు చేసింది.

Revenue Department: దుగ్గిరాల మాజీ తహసీల్దార్‌పై అభియోగాలు

  • లోకాయుక్త ఆదేశాలతో విచారణకు ప్రభుత్వం నిర్ణయం

గుంటూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌లో ఈడీగా డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న సంగా విజయలక్ష్మిపై రెవెన్యూ(విజిలెన్స్‌-1) డిపార్టుమెంట్‌ అభియోగాలు నమోదు చేసింది. ఆమె గతంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో మండలంలోని పెనుములి గ్రామంలో సర్వే నంబర్లు... 257-1, 257-1ఏలలో అడంగల్‌ నుంచి సాదినేని విజయలక్ష్మి పేరుని తొలగించారు. ఏపీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదారు పాసుబుక్స్‌ యాక్టు, 1971కి విరుద్ధంగా ఆమె వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సాదినేని విజయలక్ష్మి ఏపీ లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశాలమేరకు విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటీసు అందిన 10 రోజుల్లో అభియోగాలు నమోదుచేయాలని డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించింది.

Updated Date - Jul 05 , 2025 | 04:49 AM