సైకిలెక్కిన ఆళ్ల నాని
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:48 AM
సుదీర్ఘ కాలం పాటు ఏలూరు ఎమ్మెల్యేగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని గురువారం తెలుగుదేశంలో చేరారు

సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
సుదీర్ఘ కాలం పాటు ఏలూరు ఎమ్మెల్యేగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని గురువారం తెలుగుదేశంలో చేరారు. ఇప్ప టికే పలుమార్లు టీడీపీలో చేరేందుకు ముహూ ర్తాలు పెట్టుకున్నా చేరిక వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు నానిని సాదరంగా ఆహ్వానించి పసుపు కండువా కప్పారు. పార్టీకి నిబద్ధతతో పని చేయాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో సమా చార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, సీనియర్ నేత సుజయ కృష్ణ రంగారావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఘంటా ప్రసాదరావుతో పాటు నాని తనయుడు పాల్గొన్నారు. వైసీపీలో అత్యం త కీలకంగా, అంతకుముందు కాంగ్రెస్‌లోను నాని కీలక పాత్ర వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా, ఒకమారు ఎమ్మెల్సీగా, జగన్ జమానాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో కొన సాగుతూ వైద్య ఆరోగ్య శాఖను నిర్వర్తించారు. ఏలూరు నియోజకవర్గంలో 2009 నుంచే ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఆది నుంచి వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన టీడీపీలో చేరేం దుకు ఆసక్తి ప్రదర్శించి ఆ మేరకు అనుకున్నది సాధించగలగడం విశేషం.
నాని రాకతో..
వాస్తవానికి ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటికే ఖాళీ అయ్యింది. ఒకప్పుడు నానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారంతా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎం ఆర్డీ బలరాం దంపతులు, బొద్దాని శ్రీనివాస్‌తో పాటు మేయర్ నూర్జహాన్ పెదబాబు, మరికొం దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే బడేటి చంటికి మద్దతుగా టీడీపీలో చేరారు. వీరందరి దరి మిలా నాని టీడీపీలో చేరాలని భావించగా నియోజకవర్గ టీడీపీ శ్రేణులు వ్యతిరేకించి నిరసనలు తెలిపారు. తమ వ్యతిరేక కూటమిలో ఉన్న ఆళ్ళ నానిని పార్టీలో చేర్చుకోవడం స్థానిక ఎమ్మెల్యే చంటికి ఇష్టంలేక పోయినా అధిష్ఠానం బుజ్జగించడంతో ఆయనతో పాటు కేడర్ కాస్తా మెత్తబడ్డారు. అధిష్ఠానం ఆదేశాలను అమలు చేయక తప్పలేదు. ఈ క్రమంలోనే నానిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారంటూ ప్రచారం సాగింది. ఇప్పుడు నాని రాకతో ఏలూ రు నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో ఇక ముందు ఎలా సాగబోతున్నాయనేది ఆసక్తిక రంగా మారింది. ఎమ్మెల్యే చంటి, ఆళ్ళ నాని సయోధ్యగా ఒకటై వ్యవహరిస్తే తప్ప ఏలూరు లో రాజకీయాలు నెరపడం అంత సులువైన దేమీ కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.