Share News

భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలి

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:42 PM

శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు దేవస్థానం తరుపున సకల సదుపాయాలు కల్పించాలని ఉత్సవాల ప్రత్యేక అధికారి చంద్రశేఖర ఆజాద్‌ పేర్కొన్నారు.

 భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలి

మహా శివరాత్రి ఉత్సవాల ప్రత్యేక అధికారి చంద్రశేఖర ఆజాద్‌

శ్రీశైలం(ఆత్మకూరు), ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు దేవస్థానం తరుపున సకల సదుపాయాలు కల్పించాలని ఉత్సవాల ప్రత్యేక అధికారి చంద్రశేఖర ఆజాద్‌ పేర్కొన్నారు. సోమవారం దేవస్థానం సమావేశం మందిరంలో ఉత్సవాల నిర్వహణపై ఉభయ ఆలయాల ప్రధానార్చకులు, ఆయా విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల నిర్వహణలో ఆయా కైంకర్యాల నిర్వహణలో సమయ పాలన పాటించాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లను సిద్ధం చేయాలని చెప్పారు. ప్రత్యేకించి కాలినడకన వచ్చే భక్తులకు తాగునీటి సరఫరా కల్పించాలన్నారు. అలాగే పాదయాత్రిలకు హఠకేశ్వరం వద్ద జల్లుస్నానానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా బ్రహ్మోత్సవాలకు ముందే పాదయాత్రికులు తరలివచ్చే అవకాశం ఉందని ఈ నేపఽథ్యంలో ముందు నుంచే కైలాసద్వారం వద్ద దేవస్థానం ద్వారా అన్నప్రసాద వితరణ చేపట్టాలన్నారు. స్నానఘట్టాల ఎగువ ప్రదేశంలో కూడా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శనానికి సంబంధించి క్యూలైన్లలో భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా దృష్టి సారించాలన్నారు. క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పహారం, బిస్కెట్లను అందించాలని సూచించారు. క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల సమాచార బోర్డులు, సూచిక బోర్డులను ఉంచాలన్నారు. దేవస్థానం గదులు, కాటేజీలు, డార్మిటరీల్లో సదుపాయాలు సజావుగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేవస్థానం పరిధిలో ఆయా విభాగాలు అధికారులు, సిబ్బందితో సమన్వయంతో విధులు చేపట్టాలన్నారు. లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, దర్శన క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్‌ను పరిశీలించారు.

Updated Date - Feb 03 , 2025 | 11:42 PM