Social Media: తర్వాత చదువుదాం.. ముందు రీల్స్ చూద్దాం
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:08 AM
సెల్‌ఫోన్ అతి వినియోగంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆలోచనా ధోరణి కూడా మారిపోతోంది. స్పెయిన్ లాంటి అనేక దేశాలు పిల్లలు స్మార్ట్‌ఫోన్లు వాడకుండా నిషేధం విధించి, సోషల్ మీడియాను దూరంగా ఉంచే యోచనలో ఉన్నాయి.

సోషల్ మీడియాలో మునిగితేలుతున్న పిల్లలు
14-16 ఏళ్ల వయసు వారికి స్మార్ట్‌ఫోన్లపై విస్తృత అవగాహన
దేశంలో 90 శాతం మందికి అందుబాటులో ఫోన్లు
ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో 93.8 శాతం పిల్లలు ఫోన్ల వాడకం
సోషల్ మీడియా వినియోగంలో అబ్బాయిలే అధికం
యాప్‌ల వాడకంలో ఏపీ అమ్మాయిలు ఫాస్ట్
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రస్తుతం ఈ రెండే పిల్లల పాలిట ప్రధాన శత్రువులు. స్మార్ట్‌ఫోన్ వాడకం ఓ వ్యసనంలా మారిపోతోంది. దానినుంచి బయటపడలేక పిల్లలు చదువుల్లో వెనకబడిపోతున్నారు. సెల్‌ఫోన్ అతి వినియోగంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆలోచనా ధోరణి కూడా మారిపోతోంది. స్పెయిన్ లాంటి అనేక దేశాలు పిల్లలు స్మార్ట్‌ఫోన్లు వాడకుండా నిషేధం విధించి, సోషల్ మీడియాను దూరంగా ఉంచే యోచనలో ఉన్నాయి. మనదేశంలో చదువుకునే బాలబాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకంపై ఓ అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. 14 నుంచి 16 ఏళ్ల వయసు వారిలో ప్రతి వంద మంది పిల్లలకు 90 మందికి స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులో ఉన్నాయని జాతీయ సర్వే సంస్థ అసర్ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాలబాలికల్లో 93.8 శాతం మందికి అవి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. స్మార్ట్‌ఫోన్లను చదువు కోసం కంటే సోషల్ మీడియా కోసం వాడేవారే అధికమని నివేదికలో పేర్కొన్నారు. ఫోన్లలో వివిధ యాప్‌లను వాడడంలో దేశవ్యాప్తంగా అబ్బాయిలే ముందు ఉండగా, ఏపీలో మాత్రం అమ్మాయిలే చురుగ్గా ఉన్నట్టు అసర్ వెల్లడించింది.
నివేదికలో అంశాలు
దేశవ్యాప్తంగా 14 నుంచి 16 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ల వాడకంపై విస్తృత అవగాహన ఉంది. ఈ వయసులోని 90ు అమ్మాయిలకు, అబ్బాయిలకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్లు వాడకం తెలిసిన అబ్బాయిలు 85.5ు మంది, అమ్మాయిలు 79.4ు మంది ఉన్నారు.
14 ఏళ్ల వారిలో 27ు మందికి, 16 ఏళ్లవారిలో 37.8ు మంది సొంతంగా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వీరిలో 36.2ు మంది అబ్బాయిలు కాగా, అమ్మాయిల శాతం 26.9కి పరిమితమైంది.
14-16 ఏళ్ల వయసు పిల్లల్లో 82.2ు మందికి స్మార్ట్‌ఫోన్ వాడకం తెలుసు. ఇందులో 57శాతం మంది చదువుపరమైన అవసరాల కోసం, 76ు మంది సోషల్ మీడియా కోసం స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు.
సోషల్‌మీడియాలో మునిగితేలుతున్న వారిలఠ అబ్బాయిలు 78.8ు కాగా, అమ్మాయిలు 73.4%.
వీరిలో 62% మందికి అకౌంట్లు, ప్రొఫైల్స్ బ్లాక్ చేయడం లేదా రిపోర్ట్ చేయడం తెలుసు. 55.2 శాతం మందికి ప్రొఫైల్‌ను ప్రైవేట్‌గా ఉంచుకోవడం తెలుసు. 57.7ు మందికి పాస్‌వర్డు మార్చడం తెలుసు.
అలారం పెట్టడం, సమాచారం సెర్చ్ చేయడం, యూట్యూబ్‌లో వీడియో వెతికి షేర్ చేయడం లాంటి టాస్కులను అనేక రాష్ట్రాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలు త్వరగా పూర్తి చేశారు. ఏపీ, కర్ణాటక, కేరళల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే త్వరగా ఈ టాస్కులు పూర్తి చేశారు.
ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16 ఏళ్ల వయసు గల పిల్లల కుటుంబాల్లో 93.8ు స్మార్ట్‌ఫోన్లు కలిగిఉన్నాయి. ఇందులో 88.1ు పిల్లలకు వాటి వాడకం తెలుసు. వీరిలో సొంతంగా ఫోన్లు ఉన్న పిల్లలు 46.9 శాతం ఉన్నారు.
రాష్ట్రంలో స్మార్ట్‌ఫోన్లను చదువు కోసం వాడేవారి కంటే సోషల్ మీడియా కోసం వాడేవారే అధికం. చదువు కోసం 66.1శాతం మంది వాడుతుండగా, సోషల్ మీడియా వినియోగం కోసం వాడుతున్న వారు ఏకంగా 82.3 శాతం మంది ఉన్నారని అసర్ నివేదిక పేర్కొంది.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
For AndhraPradesh News And Telugu News