Share News

AP Media Academy Chairman: ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌గా

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:18 AM

ఆలపాటి సురేశ్‌ జర్నలిజంలో విలువలతో పనిచేశారని జర్నలిస్టు సంఘం జాతీయ నేత, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కే శ్రీనివాసరెడ్డి అన్నారు.

AP Media Academy Chairman: ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌గా

  • బాధ్యతలు స్వీకరించిన సురేశ్‌

విజయవాడ, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఆలపాటి సురేశ్‌ జర్నలిజంలో విలువలతో పనిచేశారని జర్నలిస్టు సంఘం జాతీయ నేత, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కే శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్‌ మీడియా అకాడమీ కార్యాలయంలో చైర్మన్‌గా ఆలపాటి సురేశ్‌ బాధ్యతలు స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ పాత్రికేయులు ఆయనను అభినందించి సత్కరించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ‘ప్రస్తుత కాలంలో అకాడమీ చైర్మన్‌ పదవి నిర్వహించడం సవాలుతో కూడుకున్నది. ఎలాంటి కష్టం వచ్చినా, విమర్శలు వచ్చినా ముందుకు సాగాలే తప్ప మరో మార్గం లేదు’ అని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే నేత ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టు యూనియన్‌గా మా వంతు సహకారం అకాడమీకి అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చందూ జనార్దన్‌, మణిరామ్‌, స్వర్ణ, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 04:19 AM