Share News

ఆహా..ఏమి రుచి

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:02 AM

ఎమ్మిగనూరు జాతర అంటేనే గుర్తుకు వచ్చేది కడ్డీ మాంసం.. అలా రథోత్సవం అయిపోగానే మాంసం ప్రియులు కడ్డీ మాంసం వైపు పరుగులు పెడతారు.

 ఆహా..ఏమి రుచి
కడ్టీలకు మాంసంతో పాటు కలిపే మసాలను సిద్ధం చేసిన దృశ్యం

ఎమ్మిగనూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు జాతర అంటేనే గుర్తుకు వచ్చేది కడ్డీ మాంసం.. అలా రథోత్సవం అయిపోగానే మాంసం ప్రియులు కడ్డీ మాంసం వైపు పరుగులు పెడతారు. ఆహా ఏమి రుచి.. ఔరా మైమరిచి అంటూ మాంసం రుచిని ఆశ్వాదిస్తున్నారు. కడ్డీ మాంసం ఎంతో ప్రత్యేకత ఉంది. పంటలు ఇంటికి చేరాక సంక్రాంతి పర్యదినం తరువాత వచ్చే తొలి జాతర ఇది. జిల్లా నలుమూలనుంచే కాక రాయలసీమ జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జాతరకు తరలివస్తారు. నెల రోజులకు పైగా జరిగే జాతరలో కాల్చిన కడ్డీమాంసం కోసం వచ్చేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో మద్యం ప్రియులు అభిరుచికి అనుగుణంగా వారు ఇష్టపడేలా నిప్పులపై కాల్చి ఇస్తున్నారు. కడ్డీల మాంసం కిలో దాదాపు రూ. 800 నుంచి రూ.850 పలుకుతోంది.

Updated Date - Jan 17 , 2025 | 12:02 AM